తల్లిని కత్తితో పొడిచి చంపిన 'టార్జాన్' నటుడి కొడుకు!

  • ఇంట్లో గొడవలే కారణం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరుగుపొరుగు 
  • తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు
1960లలో టీవీలో ప్రసారమైన ‘టార్జాన్’ షో నటుడు రాన్ ఎలీ (81) భార్య వలెరీ లుండిన్ ఎలీ(62) కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైంది. కాలిఫోర్నియాలోని తమ నివాసంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఆ రోజు సాయంత్రం వారింట్లో పెద్ద గొడవ జరుగుతుండడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.

ర్యాన్ ఇంటికి పోలీసులు చేరుకునే సరికే రక్తపు మడుగులో లుండిన్ చలనం లేకుండా పడి ఉంది. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు హత్యకు గురైనట్టు నిర్ధారించారు. కుమారుడు కామెరాన్ ఎలీ (30)నే ఆమెను హత్య చేశాడని నిర్ధారించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే, అతడు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కాల్చి చంపేశారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు కుటుంబ గొడవలే ఈ హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ర్యాన్ ఎలీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కిర్‌స్టెన్, కైట్‌ల్యాండ్‌, కుమారుడు కామెరాన్ ఉన్నారు. కాగా, హత్యకు గురైన వలెరీ లుండిన్ అప్పట్లో మిస్ ఫ్లోరిడాగా ఎంపికైంది.
Go Back to Shorts
Tarzan
Ron Ely
Valerie Lundeen Ely
murder

More Telugu News